అమరావతి: పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 31 నుంచి ఏపీలో ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అవసరమైన ప్రశ్న పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, బుక్‌లెట్‌ల రవాణాకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు నిర్వహించబోయే పదో తరగతి పరీక్షల్లో సీటింగ్ విషయంలో తగిన చర్యలు తీసుకుంటున్నామని విద్యా శాఖ తెలిపింది. పరీక్షల సమయంలో ఎవరైనా విద్యార్థులు జలుబు, జర్వం, దగ్గుతో బాధపడుతుంటే వారికి ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ వెల్లడించింది.
టెన్త్ పరీక్షలకు అడ్డంకులు లేకుండా చర్యలు
• SHAIK YACOOB PASHA